Chirtmas Celebrations : కరుణామయుడైన యేసు క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా వేడుకలా చేసుకుంటోంది. సెలబ్రిటీలు, క్రీడాతారలు సైతం క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయారు. భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues), స్మృతి మంధాన (Smriti Mandhana)లు రెడ్ లుక్‌తో నవ్వులు చిందించారు. ఎరుపు రంగు డ్రెస్ ధరించిన వీరిద్దరూ.. తలపై శాంతా క్యాప్‌తో మురిసిపోయారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లు సైతం అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్ ఈసారి ఇంటికి దూరంగానే క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంది. ఐదు టీ20ల సిరీస్ కోసం జట్టుతో కలిసున్న తను.. వైస్‌కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి సందడి చేసింది. శాంతాక్లాజ్‌ను తలపించేలా.. ఎర్రని డ్రెస్, తలకు రెడ్ టోపీతో వీరిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫొజిచ్చారు.
Christmas cheer ❤️ 🎄
(1/5) pic.twitter.com/KXVPn8lhNm
— ESPNcricinfo (@ESPNcricinfo) December 25, 2025
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీ షినేతో కలిసి సందడిగా క్రిస్మస్ సంబురాలు చేసుకున్నాడు. నెదర్లాండ్స్‌కు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్ తేజా నిడమనూరు సైతం తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని అలకరించుకున్నాడు. ఆ ట్రీ పక్కన నిల్చొని.. చేతిలో పెంపుడు కుక్కతో అతడు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
(4/5) pic.twitter.com/E2LUsjLvXY
— ESPNcricinfo (@ESPNcricinfo) December 25, 2025
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు గ్రేస్ హ్యారిస్, అలీసా హేలీలు క్రిస్మస్ను ఇంట్లోనే చేసుకున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్ బొమ్మ ముందు తన కుమారుడిని ఎత్తుకొని ఖుషీ అయ్యాడు. ఇక యాషెస్ సిరీస్‌లో చేతులెత్తేస్తున్న ఇంగ్లండ్ క్రికెటర్లు మెల్బోర్న్ టెస్టు కోసం శాంతా క్యాప్‌తోనే నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. వెటరన్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ వైన్ గ్లాస్‌తో క్రిస్మస్ పండుగను ఎంజాయ్ చేశాడు. ఆసీస్ వెటరన్ మాథ్యూ హెడేన్ కూతురు గ్రేస్ హెడేన్తో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నాడు. మాజీ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు కుటుంబంతో కలిసి ఈ వేడకలో పాల్గొన్నారు.
(5/5) pic.twitter.com/Uxtpbkj45I
— ESPNcricinfo (@ESPNcricinfo) December 25, 2025