గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 25, 2020 , 21:00:43

ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ హీరో: క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌

ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ హీరో: క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌

`బ‌హుబ‌లి` తో దేశవ్యాప్తంగా స్టార్‌డ‌మ్ సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ హీరో ప్ర‌భాస్. ఈ మూవీతో ప్ర‌భాస్‌కి బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అత‌నికి ఎంతో మంది సెల‌బ్రెటీలు ఫిదా అయ్యారు. అదే లిస్ట్‌లో మ‌రో స్పోర్ట్స్ సెల‌బ్రిటీ చేరిపోయాడు. అత‌డే  టిమిండియా క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్యర్.  ప్ర‌భాస్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు. ఓ నెటిజ‌న్ ద‌క్షిణాదిలో మీకు ఇష్ట‌మైన న‌టుడు ఎవ‌రు అని అడ‌గ్గా.. ప్ర‌భాస్ అంటూ స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం శ్రేయాస్ ట్వీట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంకా క్రికెట్ కాకుండా ఫుట్ బాల్ త‌న ఇష్ట‌మైన క్రీడ అని స‌మాధాన‌మిచ్చాడు. రొనాల్డ్ ఫేవ‌రేట్ ప్లేయ‌ర‌ని వివ‌రించాడు.


logo