Sarfaraz Khan | న్యూజిలాండ్‌తో టెస్టులో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. మరో సంతోషంలో మునిగిపోయారు. క్రికెటర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనంద క్షణాలను సర్ఫరాజ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోలను ఖాన్ పంచుకోవడంతో.. అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
2023 ఆగస్టులో రోమానా జహుర్తో సర్ఫరాజ్ ఖాన్‌కు పెళ్లైంది. ఈ ఏడాది ఆరంభంలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో ఖాన్ టీమిండియాకు అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌కు ముందు కుటుంబ సభ్యుల సమక్షంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ టోపీ అందుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య రోమానా, తండ్రి, కోచ్ కూడా అయిన నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 26 ఏండ్ల ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో జట్టును ఘోర పరాభవం నుంచి తప్పించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ గొప్ప ఇన్నింగ్స్ ఆడి సెన్సేషన్ అయ్యాడు సర్ఫరాజ్ ఖాన్.
ఇవి కూడా చదవండి..
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Britain’s King Charles | మీరు మా రాజు కాదు.. ఆస్ట్రేలియా పార్లమెంట్లో బ్రిటన్ రాజుకు అవమానం