మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ దేశ రాజధాని క్యాన్బెరాలో.. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్.. భారత క్రికెట్ బృందానికి విందు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన నేతృత్వంలోని భారత బృందం ప్రధాని ఆల్బనీస్ను కలిసింది. జట్టు సభ్యులను కెప్టెన్ రోహిత్ శర్మ .. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు పరిచయం చేశారు. పెర్త్ టెస్టులో విజయం సాధించిన భారత క్రికెటర్లను ప్రశంసించారు. బుమ్రా, కోహ్లీని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
Big challenge ahead for the PM’s XI at Manuka Oval this week against an amazing Indian side. ⁰⁰
But as I said to PM @narendramodi, I’m backing the Aussies to get the job done. pic.twitter.com/zEHdnjQDLS
— Anthony Albanese (@AlboMP) November 28, 2024
మరోవైపు నవంబర్ 30వ తేదీ నుంచి ప్రైమ్ మినిస్టర్ లెవన్ జట్టుతో ఇండియా రెండు రోజుల పింక్ బాల్ ప్రాక్టీసు మ్యాచ్ ఆడనున్నది. మనూకా ఓవల్ మైదానంలో ఆ మ్యాచ్ జరగనున్నది. డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న రెండవ టెస్టుకు.. ప్రాక్టీస్ మ్యాచ్ దోహదపడనున్నది. జాక్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టు కూడా ప్రధాని ఆల్బనీస్ను కలిసింది.