బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థులపై దీటైన పంచ్‌లు విసురుతూ తమన్నా, ప్రియ, దీపక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన మహిళల 51కిలోల కేటగిరీలో తమన్నా..లియు యు షాన్(చైనీస్ తైపీ)పై అలవోకగా గెలిచింది.
57కిలోల విభాగంలో ప్రియ 5-0తో పార్క్ అహ్ హ్యున్(దక్షిణకొరియా)పై చిత్తుగా ఓడించింది. బౌట్లో ఆది నుంచే రెచ్చిపోయిన ప్రియ..ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది. పురుషుల 75కిలోల బౌట్లో దీపక్..కిమ్ హ్యున్(కొరియా)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు జుగ్ను(85కి), అంజలి(75కి) ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు.