అమ్మాన్(జోర్డాన్): ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు రెండో రోజైన సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో తికమ్సింగ్ ఉధమ్‌సింగ్ రాహుల్ గరియా ముందంజ వేశారు. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 52కిలోల విభాగంలో తికమ్సింగ్.. అలీ అల్మెస్మారీ(యూఈఏ)పై అలవోక విజయం సాధించాడు.
మిగతా బౌట్లలో ఉధమ్‌సింగ్..మహమ్మద్ పార్సా(ఇరాన్)పై, రాహుల్.. లీషౌ జున్(చైనీస్ తైపీ)పై విజయాలు సాధించారు.