లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 80కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ లక్ష్య చాహర్ 5-0 తేడాతో హుస్సేన్ ఇషాహ్(జోర్డాన్)పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన లక్ష్య..ఏషియన్ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత అయిన హుస్సేన్‌పై తనదైన ఆధిపత్యం కొనసాగించాడు. అయితే రెండో రౌండ్లో పుంజుకునేందుకు జోర్డాన్ బాక్సర్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆఖరిదైన మూడో రౌండ్లో లక్ష్య క్లీన్పంచ్లతో విరుచుకుపడటంతో గెలుపు ఖరారైంది. మరోవైపు పవన్(55కి) పోరాటం ముగిసింది.