అమ్మాన్ (జోర్డాన్): ఏషియన్ అండర్-15 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ఈ టోర్నీలో మరో 14 మంది బాక్సర్లు ఫైనల్ చేరారు. ఆదివారం నాటికే 43 మెడల్స్‌ను ఖాయం చేసుకున్న భారత్.. తాజా ఫలితాలతో పతకాల సంఖ్యను మరింత పెంచుకుంది.
మహిళల అండర్-15 సెమీస్‌లో కోమల్ (30 కిలోలు), నవ్య (58 కి.), సునైన (61 కి.) రిఫరీ స్టాప్డ్ కాంటెస్ట్‌తో ఫైనల్ చేరారు. వీరితో పాటు ఖుషీ అహ్లావత్ (35 కి.), తృష్ణ మోహ్తి (67 కి.), మిల్కీ (43 కి.), ప్రిన్సి (52 కి.), స్వి (40 కి.), వంశిక (70 కి.) ఫైనల్ చేరారు. పురుషుల సెమీస్‌లో సంస్కార్ (35 కి.), రుద్రాక్ష్ (46 కి.), అభిజీత్ (61 కి.), లక్ష్య (64 కి.) గెలుపొందారు.