సోఫియా(బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు అమిత్ పంగల్, ఆకాశ్, అభిమన్యు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల 51కిలోల ప్రిక్వార్టర్స్ పోరులో అమిత్ 5-0తో రుడీ మైక్‌పై విజయం సాధించాడు.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన అమిత్.. తన అనుభవాన్నంత కూడదీసుకుంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. తొలి రెండు రౌండ్ల లో ఆధిపత్యం ప్రదర్శించిన అమిత్‌కు ఆఖరిదైన మూడో రౌండ్లో ప్రతిఘటన ఎదురైంది. పురుషుల 71కిలోల బౌట్లో ఆకాశ్, 80కిలోల బౌట్లో అభిమన్యు గెలిచి టోర్నీలో ముందంజ వేశారు.