వార్సా: ఇండియన్ బాక్సర్ పూజా రాణి(Pooja Rani).. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పతకాన్ని ఖాయం చేసుకున్నది. మహిళల 80 కేజీల విభాగంలో ఆమె సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో పూజా రాణికి మెడల్ దక్కడం అనివార్యం కానున్నది. క్వార్టర్స్‌లో పోలాండ్ క్రీడాకారిణి ఎమిలియా కోటెర్స్కాను చిత్తు చేసి పూజా విజయాన్ని నమోదు చేసింది. ఈ పోటీల్లో తొలి రౌండ్లో 34 ఏళ్ల పూజాకు బై దక్కింది. అయితే అనుభవం ఉన్న పూజా.. క్వార్టర్స్‌లో టీనేజర్ ఎమిలియాపై 3-2 తేడాతో విక్టరీ సొంతం చేసుకున్నది. గురువారం రాత్రి ఈ బౌట్ జరిగింది. 80 కేజీల విభాగంలో ఫైట్‌ను నాన్ ఒలింపిక్ వెయిట్ కేటగిరీగా భావిస్తారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మొత్తం 12 మంది బాక్సర్లు ఈ కేటగిరీలో పోటీపడుతారు.
ఈ పోటీల్లో ఇప్పటికే రెండు మెడల్స్ ఖాయం అయ్యాయి. జాస్మిన్ లాంబోరియా, నుపుర్ షీరాన్ బాక్సర్లకు మెడల్స్ దక్కనున్నాయి. ఆ ఇద్దరు కూడా సెమీస్‌లోకి ప్రవేశించారు. పురుషుల కేటగిరీలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. అభినాశ్ జామ్వాల్ 65 కేజీల విభాగంలో క్వార్టర్స్‌లో ఓడారు. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీలో మహిళల విభాగంలో ఇండియాకు నాలుగు స్వర్ణ పతకాలు దక్కాయి. నీతూ ఘాంగాస్, నిఖ్కత్, లవ్లీనా బోర్గోహెయిన్, సావేతి బోరా ఇండియాకు పతకాలను అందించారు.
సెమీఫైనల్లో లోకల్ బాక్సర్ ఎమిలీ అస్క్విత్తో పూజా రాణి తలపడనున్నారు.
2 more medals🏅 confirmed for India🇮🇳 at the World Boxing Championships!🥳
Jaismine & Pooja Rani stormed into the semifinals at the World #Boxing🥊 Championships in the women’s 57 kg & women’s 80 kg categories respectively, assuring 2⃣ more medals🏅 for India🇮🇳.
All the best… pic.twitter.com/zRrogm9P2l
— SAI Media (@Media_SAI) September 11, 2025