న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ భద్రపరిచేందుకు తగిన ఆవాసం లభించింది. స్విట్జర్లాండ్‌లోని లుసానెలోని ఒలింపిక్ మ్యూజియంలో దీనిని భద్రపరచాలని నిర్ణయించారు.
ఈ మేరకు నీరజ్ చోప్రా టోక్యోలో స్వర్ణం నెగ్గేందుకు వినియోగించిన జావెలిన్‌ను ఆదివారం మ్యూజియం అధికారులకు అందజేశాడు. తన జావెలిన్‌ను మ్యూజియంలో భద్రపరిచేందుకు అంగీకరించిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాక్కు నీరజ్ కృతజ్ఞతలు తెలిపాడు. మ్యూజియంలో భద్రపరిచే జ్ఞాపికలతో భావితరం యువత స్ఫూర్తిని పొందుతారని నీరజ్ అన్నాడు.