ఢాకా : ఏషియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. సుదీర్ఘ పతక నిరీక్షణకు తెరదించుతూ పురుషుల రికర్వ్తో పాటు మహిళల కాంపౌండ్ ఈవెంట్లలో భారత్ ఫైనల్లోకి ప్రవేశించి కనీసం రజత పతకాలు ఖాయం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పురుషుల రికర్వ్ సెమీస్‌లో యశ్దీప్ బోగే, అతను దాస్, రాహుల్‌తో కూడిన భారత త్రయం 5-3తో కజకిస్థాన్‌పై అద్భుత విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
నాలుగు సెట్ల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో భారత ఆర్చర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలి సెట్‌ను 54-52తో గెలిచిన భారత్‌కు రెండో సెట్లో కజకిస్థాన్ నుంచి 58-58తో ప్రతిఘటన ఎదురైంది. మూడో సెట్లో కజకిస్థాన్ 56-54తో ఆధిక్యం కనబర్చగా, నాలుగో సెట్లో భారత్ 57-52తో మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది. మరోవైపు మహిళల కాంపౌండ్ సెమీస్‌లో దీప్షిక, జ్యోతిసురేఖ, ప్రతీకా ప్రదీప్‌తో కూడిన భారత బృందం 234-227తో బంగ్లాదేశ్‌పై గెలిచి టైటిల్ పోరులో నిలిచింది.