జంషెడ్పూర్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో తెలుగు స్టార్ ఆర్చర్ వన్నెం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. బుధవారం జరిగిన వేర్వేరు విభాగపు కాంపౌండ్ ఫైనల్లో ప్రత్యర్థులపై విజయాలతో రెండు స్వర్ణ పతకాలు ఒడిసిపట్టుకుంది. వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో సురేఖ 150-146 తేడాతో ముస్కాన్ కిరార్(మధ్యప్రదేశ్)పై అద్భుత విజయం సాధించింది. ఇటీవల ముగిసిన ప్రపంచ ఆర్చరీ టోర్నీలో సురేఖ మూడు రజత పతకాలతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.