ముంబై: వచ్చే నెలలో జరుగబోయే దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు ముంబై, బరోడా, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లతో కూడిన సెలక్షన్ కమిటీ శార్దూల్‌ను సారథిగా నియమించింది.
15 మందితో కూడిన జట్టులో భారత స్టార్ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు వెస్ట్ జోన్‌కు ఆడనున్నారు.