నార్తాంప్టన్: ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు ఆకట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ పోరులో ఓవర్‌నైట్ స్కోరు 319-7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా 348 పరుగులకు ఆలౌటైంది.
సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించగా, మిగతా వాళ్లు బ్యాట్లు ఝులిపించలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏ.. 192/3 పరుగుల స్కోరు చేసింది. ఎమిలియొ (71) రాణించాడు.