స్విట్జర్లాండ్: భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ తన ఫ్రెంచ్ సహచరుడు అల్బనొ ఒలివెట్తో కలిసి స్విస్ ఓపెన్ ఏటీపీ 250 టూర్లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో బాంబ్రీ-ఒలివెట్ ద్వయం 3-6, 6-3, 10-6తో ఉగొ హంబర్ట్-ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)ను ఓడించారు. బాంబ్రీకి కెరీర్లో ఇది మూడో ఏటీపీ టైటిల్ కాగా ఒలివెట్తో కలిసి రెండోది.