INDA vs OMNA : ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ (INDA) జట్టు మూడో మ్యాచ్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం.. ఆపై పాకిస్థాన్ ఏ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా ఈసారి గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్ట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒమన్‌తో తలపడుతోంది భారత్. టాస్ గెలిచిన కెప్టెన్ జితేశ్ శర్మ (Jitesh Sharma) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. యశ్ ఠాకూర్ స్థానంలో విజయ్‌కుమార్ వైషాక్ ఆడుతున్నాడు.
ఆరంభ మ్యాచ్‌లో రెండొందలు కొట్టిన భారత ఏ జట్టు దాయది పాకిస్థాన్‌పై అనూహ్యంగా కంగుతిన్నది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (45), నమన్ ధిర్ (36) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. దాంతో 136కే పరిమితమైన టీమిండియా ప్రత్యర్ధిని నిలువరించలేకపోయింది. ఫలితంగా రెండు మ్యాచుల్లో ఒక విజయం ఒక ఓటమి. ఒమన్‌పై భారీ తేడాతో గెలిస్తే మళ్లీ జోరు అందుకునే అవకాశముంటుంది. కాబట్టి.. ఈ మ్యాచ్‌ను టీమిండియా సిరీయస్‌గా తీసుకోనుంది. పాక్ చేతిలో ఓడిన ఒమన్ గత మ్యాచ్‌లో యూఏఈపై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందింది. చివరి బంతికి విక్టరీ కొట్టిన ఒమన్ పటిష్టమైన భారత జట్టుకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.
భారత ఏ తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, నమన్ ధిర్, జితేశ్ శర్మ(కెప్టెన్, వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, రమన్‌దీప్ సింగ్, హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, గుర్జన్‌పీత్ సింగ్.
ఒమన్ ఏ తుది జట్టు : హమ్మద్ మిర్జా(కెప్టెన్, వికెట్ కీపర్), కరన్ సొనవాలే, వసీం అలీ, నారాయణ్ సాయిశివ్, ఆర్యన్ బిష్త్, జిక్రియా ఇస్లాం, సూఫియాన్ మొహమూద్, ముజాహిర్ రజా, సమయ్ శ్రీవాత్సవ, షఫిక్ జన్, జై ఒడెడ్రా.