Asia Cup : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఆసియా కప్(Asia Cup)లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలోయూఏఈ(UAE)ని టీమిండియా ఢీకొడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav,) ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై తేమ ఉన్నందున ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే బౌలింగ్ తీసుకున్నట్టు సూర్య వెల్లడించాడు. యూఏఈ కెప్టెన్ వసీం సైతం తాము టాస్ నెగ్గినా బౌలింగ్ తీసుకునేవాళ్లమని చెప్పాడు.
గత పదిహేను టీ20ల్లో టాస్ ఓడిపోతూ వస్తున్న భారత్ ఈసారి గెలుపొందింది. ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించాలనుకుంటున్న సూర్యకుమార్ సేన బలమైన తుదిజట్టుతో ఆడుతోంది. ఓపెనర్లుగా అభిషేక్, శుభ్‌మన్, టాపార్డర్‌లో… సూర్య, తిలక్ ఉండగా.. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ దళంలో బుమ్రా ఒక్కడే పేసర్ కాగా.. స్పిన్నర్లుగా కుల్దీప్, వరుణ్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్లుగా శివం దూబే, పాండ్యా, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు సాధించారు.
#TeamIndia‘s Playing XI for #INDvUAE 🙌
Who will get the first breakthrough for us? 🤔
Follow The Match ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 pic.twitter.com/7rgesh2nNq
— BCCI (@BCCI) September 10, 2025
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
యూఏఈ తుది జట్టు : ముహమ్మద్ వసీం(కెప్టెన్), అలిషాన్ షరాఫు, ముహమ్మద్ జొహైబ్, రాహుల్ చోప్రా(వికెట్ కీపర్), అసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాషర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్దిఖీ, సిమర్జిత్ సింగ్.