ఢిల్లీ: స్వదేశంలో వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్‌పై టీమ్ఇండియా (IND vs WI) గురిపెట్టింది. ఇప్పటికే అహ్మదాబాద్‌లో ముగిసిన మొదటి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (WTC) 2025-27 సైకిల్లో పాయింట్లను పెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో.. టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో జైస్వాల్, రాహుల్ మరోసారి జట్టుకు శుభారంభాన్ని అందించనున్నారు.
ఢిల్లీ టెస్టులో అందరి చూపు ఇద్దరు యువ ఆటగాళ్ల మీదే నిలిచింది. తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై భారీ అంచనాలు పెట్టుకున్న టీమ్ మేనేజ్మెంట్.. ఢిల్లీలో ఈ ఇద్దరూ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సాయి.. ఇప్పటిదాకా ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లలో 147 రన్స్ మాత్రమే చేశాడు. కానీ కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్.. సాయి సామర్థ్యంపై నమ్మకముంచి పదేపదే అవకాశాలిస్తున్న నేపథ్యంలో అతడు ఇకనైనా నిరూపించుకోవడం అవశ్యకం. ఇంగ్లండ్‌లో కాస్తో కూస్తో ఫర్వాలేదనిపించిన అతడు అహ్మదాబాద్ టెస్టులో 7 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు.
మరోవైపు ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. తొలి టెస్టులో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బౌలింగ్‌లో 4 ఓవర్లే వేశాడు. రెండో టెస్టులో నితీశ్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడమే గాక ఎక్కువ ఓవర్లు వేయించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇక జైస్వాల్, గిల్‌తో పాటు తొలి టెస్టు శతకవీరులు రాహుల్, వికెట్ కీపర్ జురెల్, ఆల్‌రౌండర్ జడేజాతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనుండగా జడ్డూ, కుల్దీప్, వాషింగ్టన్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది.
ఎదురు నిలుస్తారా?
తొలి టెస్టులో దారుణంగా ఓడిన విండీస్.. ఢిల్లీలో అయినా భారత్‌కు ఎదురునిలుస్తుందా? అన్నది చూడాలి. మొదటి టెస్టులో ఆ జట్టు బ్యాటర్లలో ఒక్కరైనా కనీసం 40 పరుగుల మార్కునైనా అందుకోలేదు. మరి ఈ మ్యాచ్‌లో అయినా కరీబియన్ బ్యాటర్లు భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేస్తారా? లేక గత మ్యాచ్ మాదిరిగానే దాసోహమవుతారా? అన్నది ఆసక్తికరం.
భారత జట్టు: జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్, జురెల్, జడేజా, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.