హెడింగ్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా( Ind vs Eng ). వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, దీనిపై మంచి స్కోరు చేయడం ముఖ్యమని టాస్ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఇక ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా రెండో టెస్ట్ ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో కోహ్లి సేన 151 పరుగుల తేడాతో గెలిచింది. అటు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. డేవిడ్ మలన్, ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు.
Toss & Team Update from Headingley!#TeamIndia have elected to bat against England in the third #ENGvIND Test.
— BCCI (@BCCI) August 25, 2021
Follow the match 👉 https://t.co/FChN8SDsxh
Here's India's Playing XI 🔽 pic.twitter.com/f7SSVgHInj