IND vs NA 3rd ODI : భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చివరిదైన మూడో వన్డే జరుగుతోంది. ఇండోర్ (Indore) లో హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తున్నారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేసా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ ఇలా… డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, మైకెల్ హే, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జాక్ ఫౌక్స్, జేడన్ లెనాక్స్.