Badminton | హైదరాబాద్,ఆట ప్రతినిధి: సింగపూర్ వేదికగా జరిగిన 10వ ఎఫ్‌కేకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్స్‌లో మలేషియా చేతిలో ఓటమితో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచింది.
టోర్నీలో దేశం తరఫున విద్యాధర్, లక్ష్మణ్, నందగోపాల్, జితేందర్‌రెడ్డి, మనోజ్, యూవీఎన్ బాబు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.