తైపీ సిటీ : తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల పసిడి పతక ధమాకా దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన వేర్వేరు పోటీల్లో భారత అథ్లెట్లు ఏకంగా ఆరు స్వర్ణ పతకాలతో సత్తాచాటారు.
మహిళల 800మీటర్ల ఫైనల్‌తో పాటు లాంగ్‌జంప్‌లో మన అథ్లెటు అదరగొట్టారు. పురుషుల 4X400మీటర్ల ఈవెవట్లో సంతోష్, విశాల్, ధరమ్వీర్ చౌదరీ, మనుతో కూడిన భారత బృందం 3:05:58సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సొంతం చేసుకుంది. మహిళల 400మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో విత్య రామ్రాజ్ 56.53సెకన్లతో స్వర్ణాన్ని ముద్దాడింది.