భారత్ వైట్‌వాష్
సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్ఇండియాను ఓడించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
- ఆసీస్‌తో మూడో వన్డేలో మన అమ్మాయిల ఓటమి
ముంబై: సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్ఇండియాను ఓడించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (119; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అలీసా హీలీ (82; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3, అమన్‌జ్యోత్ కౌర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హర్మన్ బృందం 32.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. మంధన (29) టాప్ స్కోరర్ కాగా.. జెమీమా (25), దీప్తి శర్మ (25) కాస్త పోరాడారు. లిచ్‌ఫీల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

