మాడ్రిడ్ : స్పెయిన్‌లో జరుగుతున్న 4వ దశ ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీక, పర్నీత్ కౌర్‌తో కూడిన భారత త్రయం.. సెమీస్‌లో 230-226తో ఇండోనేషియాపై గెలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వరల్డ్ కప్ సర్క్యూట్లో భారత త్రయానికి ఇది వరుసగా రెండో ఫైనల్.
అంతకుముందు భారత త్రయం.. క్వార్టర్స్‌లో 235-226తో ఎల్ సాల్వెడార్పై విజయం సాధించింది. ఈనెల 12న జరిగే ఫైనల్లో భారత ఆర్చర్లు.. చైనీస్ తైఫీ జట్టుతో తలపడనున్నారు. కాగా పురుషుల కాంపౌండ్‌లో మాత్రం భారత జట్టుకు నిరాశ తప్పలేదు. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్.. 233-234తో ఫ్రాన్స్ చేతిలో ఓడింది.