బ్రిస్బేన్ : ఆస్ట్రేలియా ‘ఏ’తో గురువారం మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ మహిళల జట్టు ఘోరంగా తడబడింది. వర్షం అంతరాయం మధ్య సాగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఏ’ 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి దూరమైన హార్డ్‌హిట్టర్ షెఫాలీవర్మ(35) ఫర్వాలేదనిపించింది.
పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ జార్జియా ప్రెస్ట్‌విడ్జ్(3/25) ధాటికి నందిని కశ్యప్(0), ధారా గుజ్జర్(0) పరుగుల ఖాతా తెరువకపోగా, తేజాస్ హసన్‌బిస్(9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే రాఘవి బిస్త్(26 నాటౌట్), తనుశ్రీ సర్కార్(13) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. రాఘవితో పాటు కెప్టెన్ రాధాయాదవ్(8 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.