Ind Vs SA | బెంగళూరు: స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పటిష్టమైన సౌతాఫ్రికాతో ఢీకొననుంది. సౌతాఫ్రికాతో మూడు వన్డేలకూ చిన్నస్వామి స్టేడియమే ఆతిథ్యమిస్తోంది.