బిష్కెక్ (కిర్గిస్థాన్) : సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రెండో రోజు భారత్కు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 55 కిలోల గ్రీకో రోమన్ క్యాటగిరీలో ఫైనల్ చేరిన లలిత్.. తుది పోరులో ఓడినా రజతం సాధించాడు. కాంస్య పోరులో మాజీ చాంపియన్ సునీల్ కుమార్ సత్తాచాటి భారత్కు రెండో పతకాన్ని అందించాడు.
సెమీస్లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన లలిత్, ఫైనల్లో మాత్రం 0-9తో ఇఖ్తియొర్ బొతిరొవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. నువ్వానేనా అన్నట్టుగా సాగిన 87 కిలోల కాంస్య పోరులో సునీల్.. 5-4తో రసులొవ్ (ఉజ్బెకిస్థాన్)ను మట్టికరిపించి ఈ టోర్నీలో రెండో కాంస్యాన్ని సాధించాడు. కాగా 97 కిలోల గ్రీకో రోమన్ క్యాటగిరీ సెమీస్లో నితేశ్.. 7-2తో మహమ్మదాది సరవి (ఇరాన్)పై గెలిచి ఫైనల్ చేరి దేశానికి మరో పతకం ఖాయం చేశాడు.