హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియాలో తొలిసారి హైదరాబాద్‌లో జరిగిన 60వ ఐజీఎఫ్ఆర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నేషన్స్ కప్ విజేతగా నిలిచింది. భారత గోల్ఫర్లు ముకేశ్ సింఘ్వి(105), సాజన్‌కుమార్ జైన్(100), అశోక్ దొరైస్వామి(99) పాయింట్లు సాధించారు. తైవాన్ రన్నరప్‌గా, స్విట్జర్లాండ్ మూడో స్థానంలో నిలిచింది.
రొటేరియన్ డివిజన్-1లో హరిణి జితేంద్ర, డివిజన్-2లో వర్గీస్ రుబెన్, వెటరన్స్ డివిజన్లో గిబ్సన్ పీటర్ టైటిళ్లు దక్కించుకున్నారు. టోర్నీలో 24 దేశాలకు చెందిన 180 మందికి పైగా గోల్ఫర్లు పోటీపడ్డారు. ఈ టోర్నీతో గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేయడమే కాకుండా ఆతిథ్య దేశం సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం తెలియజేసేందుకు ఆస్కారం లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.