శామీర్‌పేట, డిసెంబర్ 7 : కాంబోడియాలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన పారా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారతదేశానికి బంగారు పతకం లభించింది. పారా ఏషియన్ సెక్రటరీ వివేషన్ చేతుల మీదుగా టీమ్ వైస్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ సెక్రటరీ సింగారపు బాబు, దీరావత్ మహేశ్నాయక్లు బంగారు పథకాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా లింగాపూర్ తాండాకు చెందిన దీరావత్ మహేశ్‌నాయక్ మాట్లాడుతూ.. కాంబోడియాకి వెళ్లేందుకు దాతల సహకారం కోసం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్.. రూ.1 లక్ష సహకారం అందించారని తెలిపారు. దివ్యాంగ సమాజానికి ముందుండి నడిపిస్తున్న కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు సాధించిన ఈ విజయాన్ని కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రజలకు అంకితం ఇస్తున్నామన్నారు.