న్యూఢిల్లీ: ఆసియాన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. మంగోలియా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీ తొలి రోజే మన రెజ్లర్లు మూడు పతకాలు కొల్లగొట్టారు. గ్రెకో రోమన్ విభాగంలో సునీల్ కుమార్ (87 కిలోలు), అర్జున్ హలకుర్కి (55 కి), నీరజ్ (63 కి) రజతాలు చేజిక్కించుకున్నారు.
2020 ఎడిషన్లో స్వర్ణం నెగ్గిన సునీల్ కాంస్య పతక పోరులో సునీల్ 9-1తో బట్బయర్ లట్బయర్ (మంగోలియా)ను చిత్తు చేశాడు. అర్జున్ 10-7తో దవబందీ ముంఖ్ ఎర్డెనె (మంగోలియా)పై నెగ్గగా.. నీరజ్ 7-4తో ఇస్లోమ్జన్ భఖ్మ్రొవ్ (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించారు. సాజన్ భన్వాల (77 కి) నిరాశకు గురయ్యాడు.