పల్లకిలే: నేపాల్‌తో జరుగుతున్న ఆసియాకప్(Asia Cup) మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే భారత జట్టులో ఒక మార్పు చేశారు. తండ్రి అయిన బుమ్రా స్థానంలో.. షమీని తీసుకున్నారు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని నేపాల్ కెప్టెణ్ రోహిత్ పౌడేల్ తెలిపారు. నేపాల్ జట్టులోకి ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షేక్రీ వచ్చినట్లు చెప్పాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఓడింది. అయితే భారత్, పాక్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లెకిలేలో వాతావరణం మేఘావృత్తం అయి ఉంది. ఏక్షణమైనా వర్షం వస్తుందన్న రిపోర్ట్స్ ఉన్నాయి. టాస్ వేసిన తర్వాత మళ్లీ మైదానంలోకి కవర్స్‌ను తీసుకువచ్చారు.
🚨 Toss & Team News 🚨#TeamIndia have elected to bowl against Nepal.
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/i1KYESEMV1 #AsiaCup2023 | #INDvNEP pic.twitter.com/wX572GyE07
— BCCI (@BCCI) September 4, 2023