Ind vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఇప్పటికే ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. దీంతో భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి.. భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇండియా దక్షిణాఫ్రికాపై 58 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్.. 202 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 229 పరుగులు చేసింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్, అగర్వాల్ అవుట్ అయ్యారు. దీంతో క్రీజులో చటేశ్వర్ పుజారా, అజింక్యా రహనే ఉన్నారు.
STUMPS on Day 2 of the 2nd Test.#TeamIndia 202 & 85/2, lead South Africa (229) by 58 runs.
— BCCI (@BCCI) January 4, 2022
Scorecard – https://t.co/qcQcowgFq2 #SAvIND pic.twitter.com/OwcK1xZ7YW