విశాఖపట్నం: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత్..మరో కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత్ జోరుమీదుంటే..ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమితో మెగాటోర్నీని మొదలుపెట్టిన సఫారీలు మలి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తుచేశారు. టాపార్డర్ ఫామ్ టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో హర్మన్‌ప్రీత్, మందనతో పాటు రోడ్రిగ్స్ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయారు.
మెగాటోర్నీలో సెమీస్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో సఫారీలను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. మిడిలార్డర్లో హర్లిన్ డియోల్, రీచాఘోష్, దీప్తిశర్మ, అమన్‌జ్యోత్ రాణిస్తుండటంతో భారత్ ఒడ్డున పడుతున్నది. క్రాంతిగౌడ్, అరుంధతిరెడ్డి, దీప్తిశర్మ, శ్రీచరణి, స్నేహరానాతో బౌలింగ్ దళం బలంగా కనిపిస్తున్నది. మరోవైపు కివీస్‌పై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని చూస్తున్నది. కివీస్‌తో పోరులో తజ్మిన్ బ్రిట్స్ సెంచరీతో ఫామ్‌లోకి రావడంతో సఫారీలు మళ్లీ పోటీలోకి వచ్చారు. మొత్తంగా భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.