జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో సఫారీలతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత మహిళల జట్టు.. బుధవారం కీలక మూడో టీ20 ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకబడ్డ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యంతో పరాభవాలు మూటగట్టుకున్న ఉమెన్ ఇన్ బ్లూ.. నేటి పోరులో అయినా సత్తాచాటాలని భావిస్తున్నది. టాపార్డర్‌లో షెఫాలీ వర్మ మినహా మిగిలినవారంతా విఫలమవుతున్న నేపథ్యంలో మంధాన,రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌తో పాటు ఆల్‌రౌండర్ దీప్తి ఎలా ఆడతారనేదానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు బంతితో పాటు బ్యాట్‌తోనూ జోరుమీదున్న సౌతాఫ్రికా.. జోహన్నెస్బర్గ్లోనే సిరీస్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది.