దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టైటిల్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫైనల్ జరుగనుంది. ఓవైపు రికార్డు స్థాయిలో 12వ టైటిల్‌పై టీమ్ఇండియా కన్నేస్తే..మరోవైపు లీగ్ దశలో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
ఆయూశ్ మాత్రె సారథ్యంలోని యువ భారత్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్నది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు వికెట్‌కీపర్, బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
యూఈఏపై 95 బంతుల్లోనే వైభబ్ 171 పరుగులు చేస్తే..యూత్ వన్డేల్లో డబుల్ సెంచరీ(209) సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా అభిజ్ఞాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. వీరికి తోడు హైదరాబాదీ ఆరోన్ జార్జ్ మంచి ఫామ్ మీదుండటం కలిసిరానుంది. బౌలింగ్‌లో దీపేశ్ దేవేంద్రన్ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు.