India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. గొడవ పడ్డ క్రికెటర్లు.. ఫేక్ వీడియో వైరల్
India vs Pakistan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే కన్ఫ్యూజ్ కూడా చేస్తోంది. ఏది మంచో ఏది చెడో తెలియని సందర్భం ఎదురవుతోంది. కొన్ని ఏఐ వీడియోలు ఇక జనాలను తీవ్ర టెన్షన్‌లోకి నెట్టేస్తున్నాయి. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో భారత, పాక్ క్రికెటర్లు గొడవపడినట్లు సృష్టించిన ఓ ఏఐ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బర్మింగ్‌హామ్: ఇది ఏఐ జమానా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే కన్ఫ్యూజ్ కూడా చేస్తోంది. ఏది మంచో ఏది చెడో తెలియని సందర్భం ఎదురవుతోంది. కొన్ని ఏఐ వీడియోలు ఇక జనాలను తీవ్ర టెన్షన్‌లోకి నెట్టేస్తున్నాయి. వీడియో మాయాజాలంతో క్రికెట్ అభిమానుల్ని కొందరు బోల్తా కొట్టిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో ఇండియా తలపడింది. ఆ మ్యాచ్( India vs Pakistan )లో 64 రన్స్ తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. కానీ హర్మన్‌ప్రీత్ సేన, పాక్ క్రికెటర్ల మధ్య గొడవ జరిగినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. కానీ వాస్తవానికి మ్యాచ్‌లో అలాంటి సందర్భం ఏదీ చోటుచేసుకోలేదు. భారతీయ బ్యాట్వుమెన్ను ఓ పాకిస్తానీ క్రికెటర్ రెచ్చగొట్టినట్లుగా ఆ వీడియోలో ఉన్నది. ఆ సమయంలో భారత బ్యాటర్ కూడా పాక్ ప్లేయర్‌పై చేయి చేసుకున్నట్లు వీడియోలో ప్రజెంట్ చేశారు. ఇక అంపైర్లు వచ్చి ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు. వాస్తవానికి మ్యాచ్‌లో ఇలాంటి ఘటన ఏమీ జరగలేదు. కానీ కృత్రిమ మేధతో సృష్టించిన ఆ ఫేక్ వీడియో క్రికెట్ అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది. ఆ ఫేక్ వైరల్ వీడియోను ఓసారి మీరూ చూడండి.
Things got tense in the middle as Harmanpreet Kaur and Fatima Sana Sheikh exchanged some heated words during the India vs Pakistan showdown. 😤🔥👀#INDvsPAK pic.twitter.com/62BZPjzkKr
— Faruk (@uf2151593) June 14, 2026
టీ20 వరల్డ్ కప్‌ను భారత్ అద్భుత విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బౌలింగ్‌లో దీప్తి శర్మ (5/10), తెలుగమ్మాయి శ్రీచరణి (3/21) విజృంభించడంతో ఆదివారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా 64 రన్స్ తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ తొలుతనిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు సాధించింది.మంధానతో పాటు హర్మన్‌ప్రీత్ (35 బంతుల్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోశ్ (17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 నాటౌట్) సత్తా చాటారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా (2/33), సాదియా ఇక్బాల్ (2/41) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం దీప్తి, చరణి స్పిన్ వలలో చిక్కిన పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మునీబా అలీ (41) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 17న జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

