IND vs PAK |చెన్నై: ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ బుధవారం ముఖాముఖి తలపడనున్నాయి. టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా ఓవైపు భారత్ దూసుకెళుతుంటే..మరోవైపు పాక్ పడుతూ లేస్తూ సాగుతున్నది.
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో భారత్ 10 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుంటే..పాక్(5) నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్ బెర్తు దక్కించుకున్న టీమ్ఇండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచేయాలని పట్టుదలతో ఉంది. గెలిస్తే గానీ టోర్నీలో నిలువని పరిస్థితి పాకిస్థాన్ ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.