నాటింగ్హమ్: అనూహ్యంగా టీమిండియా టీ20 నాయకత్వ పగ్గాలను అందుకుని ఇంకా గెలుపు రుచి చూడని కొత్త సారథి శ్రేయస్ నాయకత్వంలోని భారత్.. మరో కీలక మ్యాచ్ ఆడనుంది. మంగళవారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడో టీ20లో అయినా గెలుపు రుచి చూసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే లక్ష్యంతో అయ్యర్ సేన బరిలోకి దిగనున్నది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌తో పోలిస్తే మాంచెస్టర్‌లో బ్యాటర్ల ప్రదర్శన కాస్త మెరుగైనప్పటికీ బంతితో విఫలమైన మెన్ ఇన్ బ్లూ.. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ బదులుగా మూడో పేసర్‌గా ప్రిన్స్ యాదవ్‌ను ఆడించే ఆలోచనలో ఉంది. మిడిల్ ఓవర్స్‌లో దూకుడుగా ఆడటంలో విఫలమవుతున్న భారత బ్యాటర్లు.. సిరీస్‌కు కీలకమైన మూడో టీ20లో అయినా బ్యాట్ ఝుళిపిస్తారో? లేదో? చూడాలి.