
India vs England | నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో మూడోరోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోర్ 125/4తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మరో 153 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ( 84 పరుగులు ), రవీంద్ర జడేజా ( 56 పరుగులు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. చివరలో బుమ్రా ( 28 పరుగులు) విలువైన పరుగులు చేశాడు. దీంతో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై 95 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్ నాలుగు వికెట్లు తీశాడు.