IND vs END 3rd T20I : ఇంగ్లండ్ (England) తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాజ్‌కోట్ (Rajkot) లోని నిరంజన్ షా స్టేడియం (Niranjaj Shah stadium) లో మూడో మ్యాచ్ జరుగుతోంది. భారత టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి రెండు మ్యాచ్‌లకు పక్కనపెట్టిన మహ్మద్ షమీ (Mahammad Shami) కి ఈ మ్యాచ్‌లో చోటు దక్కింది. తుది జట్టులో అతనికి చోటు కల్పించారు.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిలప్ సాల్ట్, బెన్ డెకట్, జాస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సీ, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఇండియా తుది జట్టు : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ధృవ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
Virat Kohli | ఢిల్లీ రంజీ జట్టులోకి చేరిపోయిన కోహ్లీ.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్