భారీ విజయమే లక్ష్యంగా..
రెండు భారీ విజయాలతో టీ20 ప్రపంచకప్ వేటను ఆరంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
- నేడు బంగ్లాతో తలపడనున్న భారత్
- రాత్రి 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
మాంచెస్టర్: రెండు భారీ విజయాలతో టీ20 ప్రపంచకప్ వేటను ఆరంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన టీమ్ఇండియా.. మళ్లీ గెలుపుబాట పట్టడంతో పాటు నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై భారీ తేడాతో గెలువాలనే లక్ష్యంతో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా (8 పాయింట్లు) తర్వాత రెండో స్థానాన ఉన్నా సఫారీ, బంగ్లా జట్లు సైతం అన్నే పాయింట్లతో భారత్‌కు పోటీనిస్తున్నాయి. అయితే నెట్ రన్‌రేట్ విషయంలో భారత్ (+2.511).. సౌతాఫ్రికా (-0.546), బంగ్లా (-0.641) కంటే మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. బంగ్లాతో పాటు లీగ్ దశలో ఆఖరున ఆసీస్‌తో ఆడే మ్యాచ్‌లోనూ గెలిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కానీ ఒక్కదాంట్లో ఫలితం తేడా కొట్టినా జట్టుకు కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో బంగ్లాపై భారీ తేడాతో గెలువడం హర్మన్‌ప్రీత్ అండ్ కో.కు అత్యంత కీలకం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

