పెర్త్: భారత మహిళల క్రికెట్ జట్టు పరువు నిలుపుకునేందుకు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ సమర్పించుకున్న టీమ్ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ తప్పించుకునేందుకు భారత్ సర్వశక్తులు ఒడ్డాల్సిన సమయం వచ్చింది.
స్టార్ బ్యాటర్లు స్మృతి మందన, హర్మన్‌ప్రీత్‌కౌర్ పేలవ ఫామ్ టీమ్ మేఏజ్మెంట్కు ఆందోళణ కల్గిస్తున్నది. హార్డ్ హిట్టర్ షెఫాలీవర్మను తప్పించడం జట్టుకు కలిసిరావడం లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న వికెట్ కీపర్ రీచా ఘోష్ ఒకే ఒక అర్ధసెంచరీతో ఊసురుమనిపించింది. మరోవైపు తహిలా మెక్‌గ్రాత్ సారథ్యంలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆఖరిదైన మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు తహతహలాడుతున్నది.