మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈనెల 26 నుంచి మొదలయ్యే బాక్సింగ్ డే టెస్టు టిక్కెట్ల కోసం భలే గిరాకీ ఏర్పడింది. మెల్బోర్న్లో జరిగే ఈ నాలుగో టెస్టు తొలి రోజు ఆట టిక్కెట్లన్నీ హాట్‌హాట్‌గా అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌కు వేదికైన మెల్బోర్న్ స్టేడియం సామర్థ్యం లక్ష. మ్యాచ్‌కు మరో రెండు వారాల సమయమున్నా టిక్కెటన్నీ అమ్ముడుపోవడం భారత్-ఆసీస్ మ్యాచ్‌కు ఉన్న ఆదరణకు ఉదహరణగా నిలుస్తున్నది. తాజాగా ముగిసిన అడిలైడ్ టెస్టులో మూడు రోజుల్లో మ్యాచ్ వీక్షించిన అభిమానులు లక్షా 35వేల మందిగా రికార్డయ్యారు. ఓవరాల్‌గా గతంతో పోల్చిచూస్తే ఇది కొత్త రికార్డు కావడం విశేషం.