మెకే (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా పర్యటనను భారత అండర్-19 కుర్రాళ్లు విజయవంతంగా ముగించారు. యూత్ వన్డే, టెస్టు సిరీస్‌లో భాగంగా ఆ దేశ పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టు.. రెండు సిరీస్‌లనూ క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం మెకే వేదికగా ముగిసిన రెండో యూత్ టెస్టులో అయూశ్ మాత్రే సారథ్యంలోని అండర్-19 జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని మన కుర్రాళ్లు 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి దంచేశారు. అంతకుముందు వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచిన భారత్.. టెస్టు సిరీస్‌నూ 2-0తో నెగ్గడం విశేషం.