ఢిల్లీ : తల్లికి అనారోగ్యంతో ఇంగ్లండ్ నుంచి ఉన్నఫళంగా స్వదేశానికి వచ్చిన టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. మంగళవారం తిరిగి జట్టుతో కలవనున్నాడు.
గంభీర్ తల్లి ఇటీవలే గుండెపోటుకు గురవగా ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగవుతుండటంతో అతడు మంగళవారం ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గంభీర్ నేడు జట్టుతోనూ కలిసే అవకాశాలున్నట్టు సమాచారం.