IND vs BAN | ఢాకా: ఈ ఏడాది ఆగస్టులో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో టీమ్ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ మేరకు తుది షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మంగళవారం వెల్లడించింది. ఆగస్టు 17, 20న జరిగే వన్డేలకు మీర్పూర్ ఆతిథ్యమివ్వనుండగా చివరి వన్డే (23న)తో పాటు తొలి టీ20 (26న) సైతం చట్టోగ్రామ్‌లో జరుగుతుంది.
చివరి రెండు టీ20 (29, 31న)లను మీర్పూర్లో నిర్వహించనున్నారు. స్వదేశంలో బంగ్లాదేశ్.. భారత్‌తో టీ20 సిరీస్ ఆడనుండటం ఇదే మొదటిసారి. భారత్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి తెలిపారు.