Team India | ఆగస్టులో శ్రీలంకకు టీమిండియా.. టీ20 సిరీస్‌పై స్పష్టత వచ్చేనా..!
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు (Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఆగస్టు రెండో వారం నుంచి ఇరుజట్లు తలపడుతాయని సమాచారం. అయితే.. ఇప్పటివరకూ శ్రీలంక క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు. మొత్తంఆ రెండు వారాల్లో సిరీస్ నిర్వహించాలని లంక భావిస్తోంది. ఆగస్టు 15 నుంచి 27 మధ్య మ్యాచ్‌లు ఉంటాయని క్రిక్‌బజ్‌తో బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ వెల్లడించాయి.
లంక ప్రీమియర్ లీగ్ అనంతరం భారత్, లంక మధ్య సిరీస్ జరుగనుంది. ఎల్పీఎల్ ఆగస్టు 9న ముగియనుంది. అంటే.. ఆగస్టు 15 నుంచి టెస్టు సిరీస్ షురూ కానుంది. అలానే ఇరుజట్ల మధ్య పొట్టి సిరీస్‌పై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. అవినీతిమయమైన లంక బోర్డును ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే రద్దు చేశారు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ బాధ్యతలు చూసుకుంటోంది.
JUST IN 🔔
Sri Lanka-India Tests to be played between August 15-27
Cricbuzz understands that the dates for the two Tests haven’t been finalised yet
No confirmation regarding the T20Is that were supposed to be part of the tour pic.twitter.com/ksk1pZobpa
— Cricbuzz (@cricbuzz) May 18, 2026
దాంతో.. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈమధ్యే ఐసీసీ ప్రతినిధిగా లంకకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించాడు. ఈ క్రమంలోనే నిరుడు దిత్వా తుఫాన్ బాధితుల కోసం నిధుల సమీకరణకు భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌పై చర్చించినట్టు సమాచారం.
జూన్ 6 నుంచి
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మే 31న ముగియడంతో.. జూన్ 6న భారత జట్టు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ముల్లన్‌పూర్‌లో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టులో ఆపై.. మూడు వన్డేల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సేన తలపడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనల అనంతరం శ్రీలంకకు టీమిండియా వెళ్లనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- Devjit Saikia
- ICC
- ipl 2026
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

