న్యూఢిల్లీ : భారత్‌లో మరో ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది నవంబర్‌లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్‌కు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. దీనికి తోడు ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్ భేటీ జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య మంగళవారం ఒక ప్రకటనలో అధికారికంగా పేర్కొంది. గతేడాది మహిళల ప్రపంచ బాకి్ంసగ్ టోర్నీకి వేదికైన భారత్ 2025లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ జరుగనుండటం చాలా సంతోషంగా ఉందని జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ (బీఎఫ్ఐ) అధ్యక్షుడు అజయ్‌సింగ్ అన్నారు. ‘ప్రతిష్ఠాత్మక టోర్నీలకు భారత్ వేదిక కావడం గర్వంగా ఉంది. మెగాటోర్నీ ద్వారా దేశంలో బాక్సింగ్‌కు మరింత ఆదరణ పెరుగుతుంది’ అని పేర్కొన్నారు.