Chess World Cup : ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్‌లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబురం మొదల్వనుంది. ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అయిన గోవా వేదికగా అక్టోబర్ 30 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. 23 ఏళ్ల తర్వాత భారత్‌కు చెస్ వరల్డ్ కప్ నిర్వహణ హక్కులు దక్కాయి. చివరగా 2002లో మనదేశంలో ఈ వరల్డ్ కప్ జరిగింది. ఆ ఏడాది హైదరాబాద్ వేదికగా సాగిన టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand) టైటిల్ గెలుపొందాడు.
ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే చెస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ నలుమూలల నుంచి 206 మంది పోటీపడనున్నారు. ఎనిమిది రౌండ్లలో గెలుపొందిన వారు నాకౌట్‌కు అర్హత సాధిస్తారు. అయితే.. ఆనావాయితీ ప్రకారం టాప్ 50లో ఉన్న క్రీడాకారులు నేరుగా రెండో రౌండ్ ఆడుతారు. ప్రతి రౌండ్లో రెండు ఫార్మాట్లలో గేమ్ నిర్వహింనున్నారు. స్కోర్లు సమం అయినప్పుడు టై బ్రేకర్స్. విజేతకు రూ.17 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఈ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన వాళ్లు వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించే అవకాశముంది. సో.. గ్రాండ్‌మాస్టర్లంతా తమ మాస్టర్ గేమ్‌తో చెలరేగిపోయేందుకు సిద్దమవుతున్నారు.
🔥 The FIDE World Cup 2025 is coming to Goa! 🇮🇳
🗓️ From October 30 to November 27, 2025, the world’s top players will gather on India’s west coast for one of the most exciting chess events.
🎯 Every round is win-or-go-home, making the World Cup one of the most dramatic… pic.twitter.com/Kb4Pp5thln
— International Chess Federation (@FIDE_chess) August 26, 2025
‘భారత్ బలమైన చెస్ దేశంగా ఎదుగుతోంది. ఎందరో ప్రతిభావంతులు.. చదరంగాన్ని అమితంగా ఇష్టపడే అభిమానులు ఇక్కడ ఉన్నారు. ఈ ఏడాది జార్జియాలో ఫిడే వరల్డ్ కప్ విజయవంతంగా పూర్తి అయినందున.. అదే ఉత్సాహంతో ఫిడే వరల్డ్ కప్‌ను గోవాలో నిర్వహించనున్నాం. ఇది నిజంగా చదరంగం ఆటకు సంబంధించిన పండుగ. సుమారు 90 దేశాలకు చెందిన గ్రాండ్‌మాస్టర్లు పోటీ పడనున్నారు. చెస్ చరిత్రలోనే ఇది గొప్ప వేడుకగా నిలిచిపోతుంది’ అని ఫిడే అధ్యక్షుడు అర్కాడి వొర్కోవిచ్ తెలిపాడు.